ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు అడిగాడు: ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులైన నా వాళ్ళు, పాండవులు ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో ఏం చేసారు?