ఓ అర్జునా! నిర్భయత్వం, చిత్తశుద్ధి, జ్ఞానయోగంలో దృఢస్థితి, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, అధ్యయనం, తపస్సు, కపటం లేకపోవడం, అహింస, నిజమే చెప్పడం, కోపం లేకపోవడం, త్యాగబుద్ధి, శాంతస్వభావం, ఎవరినీ నిందించక పోవడం, సర్వ ప్రాణుల మీద దయ, భోగాసక్తి లేకపోవడం, మృదుత్వం, ఓర్పు, ధైర్యం, శుభ్రత, ఎవరికీ ద్రోహం చేయకపోవడం, అహంకారం లేకపోవడం అనే ఈ (26) సుగుణాలు దైవీ సంపదతో పుట్టిన వారి లక్షణాలు.