అర్జున ఉవాచ
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ | త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ||
అర్జునుడు చెప్పాడు : ఓ మహాబాహో! హృషీకేశా! (ఇంద్రియ నియామకుడా!) కేశినిషూదనా! (కేసి అనే రాక్షసుడ్ని సంహరించినవాడా) సన్నా ్యస త్యాగ తత్త్వాలని వేరువేరుగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను.