శ్రీ భగవాన్ ఉవాచ
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః | స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచా క్రియః ||
కృష్ణ భగవానుడు చెప్పాడు : చేయవలసిన కర్మలని ఫలాపేక్ష లేకుండా ఆచరించే వాడే నిజమైన సన్న్యాసి, యోగి అవుతాడు. కేవలం అగ్నిహోత్రాన్ని వదిలిన వాడు, కర్మలని విడిచిపెట్టిన వాడు సన్న్యాసి, యోగి కాడు.